ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైజాగ్ లో ఎఫ్ 3 'ఫన్'టాస్టిక్ సెలబ్రేషన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 02:41 PM

ఔటండౌట్ కామెడీ ఎంటర్టైనర్ గా ధియేటర్లకొచ్చిన ఎఫ్ 3 కి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. పాన్ ఇండియా సినిమాల హయాంలో వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ కు ప్రేక్షకుల ఆదరణ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. సాధారణ టికెట్ రేట్లతో ప్రదర్శింపబడుతున్న ఎఫ్ 3 మూవీ ఆడియన్స్ మెంటల్ టెన్షన్ కు ఉపశమనం కలిగిస్తుంది. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. 


ఎఫ్ 3 మూవీ గ్రాండ్ సక్సెస్ తో చిత్రబృందం సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించాలనుకుంటుంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా సక్సెస్ సెలెబ్రేషన్స్ వివరాలను తెలియచేసారు. వైజాగ్ లోని ఆర్కే బీచ్ దగ్గరున్న గోకుల్ పార్క్ లో, రేపు ఐదు గంటల నుండి ఎఫ్ 3  సక్సెస్ సెలెబ్రేషన్స్ జరగనున్నట్టు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com