తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ తీయాలని ఉందని ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ అన్నారు. ఇటీవల ఆయన కొండా సురేఖ దంపతులపై తీసిన 'కొండా' సినిమా గురించి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఇందులో కేసీఆర్ బయోపిక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరి బయోపిక్ తీసినా ఉన్నది ఉన్నట్లు చూపిస్తానన్నారు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపించే శైలి తనది కాదన్నారు.