టాలీవుడ్‌లో భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ "రౌద్రం రణం రుధిరం" ప్రపంచ ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ పొందుతోంది. ఎన్టీఆర్‌కి ఆఫ్‌లైన్‌లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రేజ్‌తో ఎన్టీఆర్ ట్విట్టర్ ఖాతా ఇటీవల 6 మిలియన్ మార్క్‌ను చేరుకుంది. దీంతో 60 లక్షల మంది ట్వీటర్ల కుటుంబంలో తారక్ చేరిపోయాడు. ఇదిలా ఉంటే, అతని తదుపరి రెండు భారీ చిత్రాలు ఇటీవల ప్రకటించబడ్డాయి మరియు పాన్ ఇండియా స్థాయిలో ఓ రేంజ్లో ఉండవచ్చని భావిస్తున్నారు.