జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని నందమూరి అభిమానులకు డబుల్ ధమాకా అప్డేట్లు అందాయి. కొరటాలతో చేస్తున్న ఎన్టీఆర్ 30 మూవీ మోషన్ పోస్టర్ , ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 ఫస్ట్ లుక్ పోస్టర్ లతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలలోనూ తారక్ చాలా ఇంటెన్స్ గా, వయొలెంట్ రోల్ ను పోషిస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఈ రెండు సినిమాల అప్డేట్లకు ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి విశేష స్పందన వస్తుంది.
ఎన్టీఆర్ 31నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో తారక్ కళ్ళకు కాటుక పెట్టుకుని, చాలా కోపంగా, వయొలెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు అసుర అనే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎన్టీఆర్ 31 ఫస్ట్ లుక్ పోస్టర్ కు అసుర టైటిల్ కరెక్ట్ గా సరిపోతుంది. ఫ్యూచర్ లో అసుర టైటిల్ నే చిత్రబృందం ఎనౌన్స్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa