షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం జవాన్. సౌత్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ను నిన్ననే విడుదల చేసారు. టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. షారుఖ్ పవర్ఫుల్ యాక్టింగ్, ఇంటెన్స్ లుక్, బ్యాండేజ్ ... అన్ని ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసాయి. వచ్చే ఏడాది జూన్ 2వ తేదీన జవాన్ రిలీజ్ అవుతుంది.
ఈ చిత్రంలో షారుఖ్ సరసన నటించే గోల్డెన్ ఆపర్చ్యునిటీని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వదులుకుందని ప్రచారం జరుగుతుంది. జవాన్ సినిమా కోసం 2019లో డైరెక్టర్ అట్లీ సమంతను సంప్రదించినపుడు, చైతూ తో ఫ్యామిలీ ప్లాన్ చెయ్యబోతున్నానని చెప్పి ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. సమంత నిరాకరించడంతో జవాన్ ఆఫర్ లేడి సూపర్ స్టార్ నయనతార ను వరించింది. సమంత తన ఇంస్టా గ్రామ్ ఖాతాలో జవాన్ టీజర్ ను స్టోరీ గా షేర్ చెయ్యడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa