సత్యరాజ్... అసలు పేరుతో కన్నా రాజమౌళి పుణ్యమా అంటూ కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులరయ్యారు. అప్పటి నుండి ఆయన ఏ సినిమా చూసిన అదిగో కట్టప్ప అని ప్రేక్షకులు గుర్తు పట్టడం స్టార్ట్ చేసారు. కోలీవుడ్, టాలీవుడ్లలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వరస సినిమాలతో దూసుకుపోతున్న కట్టప్ప ఒక సినిమాపై తన అయిష్టతను తెలియచేసారు.
ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యరాజ్ తనకు షారుఖ్ ఖాన్ తో చేసిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా అంటే ఇష్టముండదని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్షన్లో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం చెన్నై ఎక్స్ప్రెస్. 2013లో విడుదలైన ఈ చిత్రం భారీవిజయం సాధించింది. ఇందులో సత్యరాజ్ దీపికా తండ్రిగా, పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటించారు. రక్షిత్ ఈ కధ చెప్పినపుడు తన పాత్ర సత్యరాజ్ కు అసలు నచ్చలేదట. స్టోరీ కూడా అంత గొప్పగా ఏమి లేదని అనుకున్నాడట. ఇదే విషయాన్ని షారుఖ్ కు, రోహిత్ కు చెప్పినా చివరికి సినిమా చెయ్యక తప్పలేదట. అందుకు ప్రధాన కారణం షారుఖ్ ఖాన్ అని చెప్పారు. చెన్నై ఎక్స్ప్రెస్ లో నా పాత్ర నచ్చకపోయినా కేవలం షారుఖ్ తో పని చేసేందుకే ఆ సినిమా చేసానని సత్యరాజ్ తెలిపారు. ఆయన నటన, ముఖ్యంగా DDLJ (దిల్ వాలే దుల్హనియా లేజాయింగే) లో షారుఖ్ యాక్టింగ్ సూపర్ ..అలాంటి వ్యక్తిని దగ్గరుండి చూడటం కోసమే చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా చేసానని సత్యరాజ్ చెప్పారు.
![]() |
![]() |