మందన పోజులు నేషనల్ క్రష్ రష్మిక మందన వెరీ వెరీ స్పెషల్. చాలా ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అది కూడా ఒక్క టాలీవుడ్ లో మాత్రమే కాదు. కన్నడ, తమిళంలోనూ ఆ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ హవా మొదలైంది. అక్కడ మిషన్ మజ్ను, గుడ్ బై. యానిమల్ సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు. తాను నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది. పలు యాడ్స్ లో నటిస్తుంది. ప్రముఖ మేగజైన్స్ కవర్ పేజీలపై మెరుస్తోంది. తాజాగా ఫిల్మ్ ఫేర్ మేగజైన్ కోసం మస్త్ గా పోజులు ఇచ్చింది. ఆరెంజ్ కలర్ జాకెట్, వైట్ షాట్ ధరించి హాట్ గా కనిపించింది. బాలీవుడ్ భామలు కుళ్లుకునే విధంగా రష్మిక అందాలు ఆరబోయడం.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.