సినీ స్టార్స్ సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లి డేట్ చెప్పకుండా, ఎవరికి తెలియకుండా ఫారిన్ చెక్కేసి.. మ్యారేజ్ చేసు కుంటున్నారు. పెళ్లి సంబంధించిన సింగిల్ పిక్ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే నయనతార-విగ్నేష్ శివన్ ఇందుకు భిన్నంగా ఆలోచించారు. పెళ్లి వేడుకను ఓటీటీలో లైవ్ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. నెట్ ఫిక్స్ సీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇందుకోసం భారీగా తీసుకున్నారట. సింపుల్ గా చెప్పాలంటే పెళ్లిని కూడా కమర్షియల్ చేసేశారు. ఇక వీరి పెళ్లికి సౌత్ స్టార్స్ అంతా హాజరు కాబోతున్నారని తెలిసింది.
![]() |
![]() |