కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా గత పదేళ్ల నుండి స్టార్ హీరోయిన్ గా సమంత బాలీవుడ్ ఎంట్రీ పై ఇటీవలి కాలంలో పలు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో సమంత మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందనే తాజా వార్త అందరిని షాక్ కు గురి చేస్తుంది.
ప్రముఖ మాలీవుడ్ వెటరన్ డైరెక్టర్ షాజీ కైలాష్ గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే పృథ్విరాజ్ సుకుమారన్ తో కడువా సినిమా చేసిన కైలాష్ రీఎంట్రీలో సూపర్ హిట్ ను అందుకున్నారు. ప్రస్తుతం మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ను లైన్ లో పెట్టిన కైలాష్ ఆపై తిరిగి పృథ్విరాజ్ తో మరో సినిమా చెయ్యనున్నారు. ఈ రెండు సినిమాలు పక్కనపెడితే కైలాష్ ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీని రూపొందించనున్నారని మాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ మేరకు ఈ వారంలోనే అధికారిక ప్రకటన జరగనుందని అంటున్నారు. "పింక్ పోలీస్" టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ గా కైలాష్ ముగ్గురు స్టార్ హీరోయిన్లను అనుకుంటున్నారట. కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార, సమంత, ట్యాలెంటెడ్ విద్యాబాలన్..ఈ ముగ్గురిలో ఒకరిని ఫైనలైజ్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తుంది. నయన్, విద్యాబాలన్ ఇప్పటికే మలయాళ సినిమాలు చేసారు కాబట్టి కైలాష్ సమంత ను ఈ సినిమాతో మాలీవుడ్ కి పరిచయం చెయ్యటం ఖాయమని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తీకరిస్తున్నారు. చూడాలి మరి పింక్ పోలీస్ గా చివరకు ఎవరు ఫైనల్ అవుతారనేది.
![]() |
![]() |