రానా దగ్గుబాటి, సాయిపల్లవి జోడీగా వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'విరాటపర్వం' జూన్ 17న థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్‌ను పెంచారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను హీరోయిన్ సాయిపల్లవి పంచుకుంది. విరాటపర్వం సినిమాలో గన్ ఫైరింగ్, ఫైట్ సన్నివేశాలలో నటించానని, అవి తనకు చాలా థ్రిల్ ఇచ్చాయని పేర్కొంది. సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను ఆమె కోరారు.