డియర్ మేఘాలో చివరిసారిగా కనిపించిన బ్యూటీ యాక్ట్రెస్ మేఘా ఆకాష్ తన తదుపరి తెలుగు ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. అభిమన్యు బద్ది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. తాజాగా ఇప్పుడు రాహుల్ విజయ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. 'మాటే మంత్రము' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, అభయ్ బేతిగంటి, వైవా హర్ష, బిగ్‌బాస్ సిరి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి హరి గౌర సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ మరియు కోట ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి.