టాలీవుడ్ యువనటుడు సత్యదేవ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం గాడ్సే. విభిన్న తరహా సినిమాలు చేస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. గోపి గణేష్ దర్శకత్వంలో CK స్క్రీన్స్ పతాకంపై సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటివరకు సినిమా నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా, తాజాగా ఈ సినిమా నుండి చిత్రబృందం బిగ్ అప్డేట్ ఇచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు థియేట్రికల్ ట్రైలర్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆవిష్కరించనున్నారని చిత్రబృందం సోషల్ మీడియాలో అధికారికంగా, ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో తనికెళ్ల భరణి, నాగబాబు , బహ్మాజీ, నోయల్, ప్రియదర్శి, నాజర్, సిజ్జు మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్, శాండీ అద్దంకి సంగీతం అందించగా, జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa