'ఆర్ఆర్ఆర్' తో సూపర్ సక్సెస్ ను అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో చేయనున్న విషయం తెలిసిందే. RC#15 వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ సినిమాలో చెర్రీ డ్యూయల్ రోల్ లో ప్రేక్షకులను పలకరించనున్నాడని టాక్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టూడెంట్ గా, రాజకీయనాయకుడిగా, ప్రుభుత్వోద్యోగిగా, సామాన్యుడిగా నాలుగు విభిన్నమైన పాత్రలను చరణ్ పోషిస్తున్నట్టు తెలుస్తుంది.
హైదరాబాద్, పంజాబ్ లలో వరస షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే వైజాగ్ లో స్టార్ట్ అయ్యింది. కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ ను మేకర్స్ ఈ జూన్ 20 నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఐతే వైజాగ్ లోనా లేక మరో కొత్త లొకేషన్ లోనా అన్నది ఇంకా తెలియదు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa