సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లో బిజీగా మారిన పవన్ తిరిగి చిత్రసీమలో అడుగుపెట్టి నటించిన మొదటి చిత్రం వకీల్ సాబ్. బిగ్ బి అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రలు పోషించిన సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రం " పింక్" కు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కింది. ఈ సినిమాకు MCA ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. కరోనా ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పడుతున్న సమయంలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. నివేదా థామస్,అనన్య నాగళ్ళ, అంజలి కీలక పాత్రల్లో నటించగా తమన్ సంగీతమందించారు.
వేసవి వచ్చిందంటే చాలు అనుచరులకు, సన్నిహితులకు తన సొంత తోటలో కాసిన మామిడి పండ్లను బహుమతిగా పంపించే పవన్ ఈ వేసవిలో వేణు శ్రీరామ్ కి సీజనల్ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ మేరకు శ్రీరామ్ భార్య గాయత్రీ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. పవన్ పంపించిన మామిడికాయల ఫోటోలను షేర్ చేసి కృతజ్ఞతలను తెలియచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa