విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. డైరెక్టర్ వేణు ఉడుగుల ఈ సినిమాను నక్సలిజం నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా రూపొందించారు. గతేడాదిలోనే విడుదల కావలసిన ఈ సినిమా కరోనా మరియు కొన్ని అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. ఈ క్రమంలో ఆదివారం ట్రైలర్ ను విడుదల చేసారు. ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి, సినీ సెలెబ్రిటీల నుండి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ ప్రివ్యూను చూసిన హీరో నిఖిల్ సిద్దార్థ్ తన రివ్యూ ను ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇలాంటి సినిమాను ప్రేక్షకులకందించిన డైరెక్టర్ వేణు ఉడుగులకు, నిర్మాత సుధాకర్ చెరుకూరికి హ్యాట్సాఫ్ చెప్పారు. ఈ సినిమా చూసి షాక్ అయ్యాయని, కెరీర్లోనే ది బెస్ట్ పెరఫార్మెన్స్ సాయిపల్లవి ఈ సినిమాలో ఇచ్చిందని, ఇక రానా దగ్గుబాటి అద్భుతమైన నటన కు తాను ఫిదా అయ్యాయని నిఖిల్ ట్వీట్ లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa