ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగచైతన్య "థాంక్యూ" ఫస్ట్ సింగిల్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 09, 2022, 12:41 PM

అక్కినేని నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం థాంక్యూ. మనం సినిమా తర్వాత విక్రమ్ కే. కుమార్ నాగచైతన్యతో చేస్తున్న రెండో సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్, అవికా గోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. జూలై 8వ తారీఖున ఈ సినిమా విడుదలవబోతుంది. ఇటీవలే టీజర్ తో సర్ప్రైజ్ చేసిన చైతు తాజాగా అక్కినేని అభిమానులకు మరో సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. థాంక్యూ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసారు. జూన్ 10న సాయంత్రం 5 గంటలకు ఫస్ట్ సింగిల్ “మారో మారో” ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపే అధికారిక పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసారు. ఈ పోస్టర్ లో హాకీ ఆటగాడిగా చైతు ఆసక్తిని కలిగిస్తున్నాడు. గతంలో విడుదలైన టీజర్ ప్రకారం, ఈ సినిమాలో నాగచైతన్య మూడు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa