మాధవన్ అండ్ విజయ్ సేతుపతి నటించిన తమిళ సినిమా "విక్రమ్ వేద" సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి పుష్కర్ అండ్ గాయత్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హిందీ వెర్షన్ రీమేక్ లో హృతిక్ రోషన్ అండ్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విక్రమ్ రోల్ లో కనిపించనుండగా, హృతిక్ రోషన్ వేద రోల్ పోషిస్తున్నాడు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో రాధికా ఆప్టే కీలక పాత్రలో కనిపించనుంది. సెప్టెంబర్ 30, 2022న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa