పరశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం "సర్కారు వారి పాట". మే 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన అందుకుంది. కాగా, తాజాగా ఈ సినిమాలోని 'పెన్నీ' వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. థమిన్ పాడిన ఈ పాట ట్యూన్ కొత్తగా ఉండడం.. లిరిక్స్ క్యాచీగా ఉండడంతో ప్రేక్షకులు తెగ నచ్చేశారు. అనంత శ్రీరామ్ స్వరపరచిన ఈ పాటను నకాష్ అజీజ్ ఆలపించారు. ఇటీవల విడుదలైన మురారి వా వీడియో సాంగ్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.