బుట్టబొమ్మ పూజా హెగ్గే నిండుగా బంగారు ఆభరణాలు ధరించి ధగధగ మెరిసిపోతుంది. యువరాణిలా కనిపి స్తుంది. 23 BehindTheScenes పేరుతో రెండు ఫోటోలు షేర్ చేసింది పూజ. అన్ సీస్ పిక్స్ లా కనిపి స్తున్న వీటికి నెటిజన్లు లైకులు కొడుతున్నారు. హృతిక్ రోషన్ తో కలిసి పూజా నటించిన 'మోహెంజో దారో' సినిమాలో ఈ రకమైన గెటప్ లోనే కనిపించింది. మళ్లీ ఇన్నాళ్లకు నిండుగా ఆభరణాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సల్మాన్ ఖాన్ కి జంటగా కభీ ఈద్ కబీ దీవాలీ సినిమాలో నటిస్తుంది. ఇక మహేష్-త్రివిక్రమ్, హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ సినిమాల కోసం హీరోయిన్ గా ఎంపికైంది. త్వరలోనే ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.