రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "విరాటపర్వం". జూన్ 17న సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన మేకర్స్ అందుకు తగ్గట్టుగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం జూన్ 12న చలో చలో పాటను విడుదల చేయనున్నట్టు వారియర్ ప్రకటించింది. రానా స్వయానా ఈ పాటను పాడాడు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నారు.