సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హాస్యనటుడు వెన్నెల కిషోర్. సినిమాల్లో ఏవిదంగా ఉంటాడో.. ట్విటర్‌లో కూడా అలాంటి పంచ్‌లే వేస్తూ.. సమాధానాలు ఇస్తు ఉంటాడు. తాజాగా అలాంటి ఓ ట్వీట్ ఫన్ క్రియేట్ చేస్తోంది. వెన్నెల కిషోర్ పోస్ట్ చేసిన ఆ ఫోటో వైరల్ అవుతోంది. నిన్న సాయంత్రం సరదాగా కమెడియన్స్ అందరూ స్కూల్ యూనిఫామ్స్ వేసుకుని దిగిన ఫోటోను షేర్ చేశాడు. బ్యాక్2స్కూల్ థీమ్ పార్టీ అంటూ.. పోస్ట్ చేసిన వెన్నెల కిషోర్.. ఈ సారి మాత్రం నాకు మరీ చిన్న షార్ట్ వచ్చిందంటూ.. ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో సప్తగిరి, ధన్‌రాజ్, రోలర్ రఘు, చిత్రం శ్రీను, వేణు వండర్‌లతో పాటు మరికొంతమంది ఉన్నారు. మరి వీరందరూ కలిసి ఆదివారం బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa