నాగశౌర్యకు జోడీగా 'కృష్ణ వ్రిందా విహారి' సినిమాతో వెండి తెరకు పరిచయమైంది న్యూజిలాండ్‌కు చెందిన షెర్లీ సేథియా. తాజాగా బాలీవుడ్‌లో ఆమె నటించిన చిత్రం 'నికమ్మా' జూన్ 17న విడుదల కానుంది. ఇదిలా ఉండగా కోవిడ్ వల్ల తాను రెండేళ్లు తల్లికి దూరమయ్యానని ఆమె పేర్కొంది. న్యూజిలాండ్ నుంచి తన కోసం ఇటీవల ముంబై వచ్చిన తల్లిని హత్తుకుంది. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుని, భావోద్వేగానికి గురైంది.