సెలెబ్రిటీలు కనిపిస్తే చాలు వారితో ఫోటో దిగాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలని అభిమానులు వారి చుట్టూ గుమ్మిగూడేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు మనకు కొత్తేమి కాదు. రోజు చూస్తూనే ఉంటాం. సహజంగా వేలకొద్దీ ఉన్న అభిమానుల నుండి సెలెబ్రిటీలను కాపాడే బాధ్యత బౌన్సర్లదే. సెలెబ్రెటీలకు దగ్గరగా వచ్చే అభిమానులను అడ్డుకోనేది వారే. అలాంటిది ఒక స్టార్ హీరో మరో హీరోయిన్ కు బౌన్సర్ లా మారాడంటే... అతనెంత మంచోడో కదా...!అతను మరెవరో కాదు...దగ్గుబాటి రానా. ఆ హీరోయిన్ ఎవరంటే...లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. విరాటపర్వం ప్రమోషన్స్ లో సాయిపల్లవి స్టేజిపై మాట్లాడుతుండగా, ఆమెకు రానా బౌన్సర్ లా మారి రక్షణ కల్పించాడు. కర్నూలు లో విరాటపర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు, గాలిదుమారం తో పెద్ద వర్షం పడింది. అప్పుడు కూడా స్టేజిపై సాయిపల్లవి మాట్లాడుతుంటే, ఆమెకు గొడుగు పట్టి తన పెద్ద మనసును చాటుకున్నాడు. నిజానికి ఇలాంటివన్నీ ఒక స్టార్ హీరో కాదు కదా.... మీడియం రేంజ్ హీరో కూడా చెయ్యడు. సినిమాల్లో నటిస్తే పేరొస్తుంది. బయటకూడా నటిస్తే రానా కి ఏమొస్తుంది చెప్పండి. అది ఆయన సహజలక్షణం కాబట్టే ఎలాంటి ఈగోలకు పోకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో భాగమయ్యాడు, ఆమెకు గొడుగు పట్టాడు, చివరికి బౌన్సర్ లా కూడా మారాడు. అది ఆయన క్యారెక్టర్.. హి ఈజ్ ఏ రియల్ హీరో...