చాన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కమల్ హాసన్ కు "విక్రమ్" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ నిచ్చింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, హీరో సూర్య నటించారు. రెండు వారాల క్రితం విడుదలైన ఈ సినిమాకు ధియేటర్ల వద్ద ఇంకా రష్ తగ్గలేదు. తమిళం, తెలుగు, హిందీ బాక్సాఫీస్ ల వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది. అన్ని భాషల్లో కలిపి విక్రమ్ సినిమాకు ఇప్పటివరకు రూ. 300 కోట్లు వచ్చాయని తెలుస్తుంది. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ సొంతంగా నిర్మించారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ... మూడు వందల కోట్ల వసూళ్లను సాధిస్తానని ఇదివరకే చెప్పాను. తాజాగా అదే విషయం నిజమయ్యింది. విక్రమ్ సినిమా లాభాలతో నా అప్పులు తీర్చుకుంటా..అలానే అవసరంలో ఉన్న స్నేహితులకు సహాయం చేస్తాను... అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa