ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు బి ప్రాక్ ఇంట్లో తీవ్ర విషాధం నెలకొంది. ఆయన భార్య మీరా బచన్ బుధవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డ వెంటనే మరణించడంతో దంపతులిద్దరూ వేదనలో మునిగిపోయారు. ఈ విషయాన్ని బి ప్రాక్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. తమ బిడ్డ ప్రాణాలను నిలపడానికి శాయశక్తులా యత్నించినా వైద్యులు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక సోషల్ మీడియాలో బి ప్రాక్ దంపతులకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.