ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్జీవీ "కొండా" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రేవంత్ రెడ్డి రాక

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 16, 2022, 02:35 PM

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో రాబోతున్న కొత్త చిత్రం "కొండా". తెలంగాణా రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన కొండా మురళి బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. కొండా మురళి, ఆయన సతీమణి కొండా సురేఖ ల రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల ఆధారంగా ఆర్జీవీ ఈ సినిమాను తెరకెక్కించారు. యాపిల్ ట్రీ, ఆర్జీవీ నిర్మాణంలో శ్రేష్ట్ పటేల్ మూవీస్ సమర్పణలో కొండా సుస్మిత పటేల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో త్రిగుణ్, ఇర్రా మోర్ హీరోహీరోయిన్లుగా నటించారు. జూన్ 23న థియేటర్లలో విడుదలవబోతున్న ఈ చిత్రం గతకొన్ని రోజుల నుండి ప్రమోషన్స్ చేస్తుంది. గతంలో ఒక ట్రైలర్ ను విడుదల చేసిన మేకర్స్ ఇటీవలే మరొక ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసి కొండా సినిమాపై ఇంటరెస్ట్ కలిగించారు. 


ప్రమోషన్స్ లో భాగంగా ఈ నెల 18వ తేదీన కొండా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో జరుగుతుందని ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వరంగల్ ఖుష్ మహల్ గ్రౌండ్ లో సాయంత్రం ఆరున్నర గంటల నుండి ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ట్విట్టర్ ద్వారా ఆర్జీవీ కృతజ్ఞతలను తెలియచేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com