'విరాటపర్వం' సినిమా టికెట్ ధరలు ఖరారయ్యాయి. సింగిల్ స్క్రీన్స్ కి తెలంగాణలో రూ.150, ఏపీలో రూ.147 గా నిర్ణయించారు. మల్టీప్లెక్స్ లో తెలంగాణలో రూ.200, ఏపీలో రూ.177(జీఎస్టీతో కలిపి) గా నిర్ణయించారు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా జూన్ 17న విడుదల కానుంది.