సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే "సర్కారువారిపాట" సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ నుండి, ప్రేక్షకుల నుండి విపరీతమైన అప్లాజ్ వచ్చింది. SVP సక్సెస్ జోష్ ను, సమ్మర్ వెకేషన్ ను, కొడుకు గౌతమ్ టెన్త్ క్లాస్ పాస్ ఐన సెలెబ్రేషన్స్ ....ఈ మూడు సందర్భాలను పురస్కరించుకుని మహేష్ యూరప్ లో లాంగ్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ కుటుంబం తో కలిసి రోడ్ ట్రిప్ లో యూరప్ లోని పలు ప్రముఖ దేశాలను, ఫేమస్ ప్లేసెస్ ను సందర్శిస్తున్నారు. ముందుగా జర్మనీ తో మొదలుపెట్టి, స్విట్జర్లాండ్, ఇటలీ వంటి ప్రముఖ హాలిడే స్పాట్ లలో మహేష్ అండ్ ఫ్యామిలీ సేద తీరుతున్నారు. ఈ క్రమంలో మహేష్ తన వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఇటలీలో కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను మహేష్ షేర్ చేసారు. ఈ ఫొటోల్లో కూతురు సితారను మహేష్ వెక్కిరిస్తున్న ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. తండ్రి, కూతుళ్ళ మధ్య మంచి స్నేహానుబంధం ఉందని ఈ ఫోటోల ద్వారా క్లియర్ గా తెలుస్తుంది.
వెకేషన్ నుండి రాగానే మహేష్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా అవుతారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ కాగా తమన్ మ్యూజిక్ డైరెక్టర్.