ఈ మధ్యకాలంలో చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ కరోనాను కొనితెచ్చుకున్నారు. వారంతా కరణ్ జోహార్ పుట్టినరోజు పార్టీకి హాజరైనవారు. అయితే ఈ విషయంలో సెలబ్రిటీలకు కరోనా సోకడానికి కారణం కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీనేనని చాలా మంది పెదవి విరిచారు. దీనిపై కరణ్ జోహార్ స్పందించారు. తనను తిట్టి లాభం లేదని, వారికి కరోనా రావడానికి కారణం తాను మాత్రం కాదని తెలిపారు. అందరూ నోటికొచ్చినట్లు మాట్లాడ్డం సమంజసంకాదని అన్నారు.