యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం సమ్మతమే. ఈ సినిమాతో గోపినాధ్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయమవబోతున్నారు. యూ జి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవడానికి సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల నుండి మూవీకి సంబంధించిన ఇంటరెస్టింగ్ విషయాలపై పలు అప్డేట్లు ఇస్తూ వస్తున్న టీం తాజాగా సమ్మతమే థియేట్రికల్ ట్రైలర్ ను తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ విడుదల చేస్తారని ప్రకటించింది. ఈ మేరకు ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ రోజు సాయంత్రం 04:05 గంటలకు థియేట్రికల్ ట్రైలర్‌ను టీఆర్‌ఎస్ మంత్రి కేటీఆర్ లాంచ్ చెయ్యనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతమందించారు.