సర్కారువారిపాట లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా (SSMB 28) చెయ్యబోతున్నారన్న విషయం తెలిసిందే కదా. అధికారికంగా ప్రకటన జరిగినప్పటి నుండి ఈ సినిమాపై పలువార్తలు చిత్రసీమలో జోరుగా ప్రచారం చెయ్యబడుతున్నాయి. అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు పదకొండేళ్ల కు మళ్ళీ మహేష్ - త్రివిక్రమ్ కాంబో పట్టాలెక్కడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా, తమన్ మ్యూజిక్ డైరెక్టర్.
మహేష్ SVP కు కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసారు. ఆ సినిమా విడుదలకు ముందు తమన్ ఇచ్చే అప్డేట్లు హాట్ టాపిక్ గా నిలిచాయి. ఫ్యాన్స్ లో SVP పై అంచనాలను తమన్ పోస్టులు మరింత పెంచేసాయి. సేమ్ సీన్ తమన్ SSMB 28 కు కూడా రిపీట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ తో కలిసి దిగిన ఒక ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, మా జర్నీలో కొత్త రికార్డులు మొదలు #SSMB 28 అంటూ కామెంట్ చేసాడు. కానీ ప్రతిసారి ఇలాంటి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? ఇప్పటికే SSMB 28 పూర్తి స్క్రిప్ట్ మహేష్ కు నచ్చలేదని, అసలు ఇంకా పూర్తి స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ పూర్తి చేయలేదని ఇలా పలు వార్తలు హల్చల్ చేస్తున్న క్రమంలో తమన్ చేసిన ఈ పోస్టు కాస్త ఓవర్ గా కనిపిస్తుందని కొంతమంది అంటున్నారు.