కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం "ది వారియర్". ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో రామ్ సరసన కృతి శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. DSP సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ మూవీ నుండి ఇటీవల విడుదలైన బుల్లెట్ లిరికల్ సాంగ్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. ఈ గీతాన్ని కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఆలపించటం విశేషం. ఈ పాటకు తెలుగులో శ్రీమణి, తమిళంలో వివేక్ సాహిత్యం అందించారు. ఈ ఒక్క పాట కోసమే నిర్మాతలు మూడు కోట్ల భారీ బడ్జెట్టును కేటాయించినట్టు తెలుస్తుంది. హై ఓల్టేజ్ మాస్ స్టెప్పులతో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న ఈ పాట ఇప్పటికే యూట్యూబ్ గ్లోబల్ టాప్ మ్యూజిక్ లో ట్రెండ్ అవుతుండగా, తాజాగా 100 మిలియన్ వీక్షణలతో బ్రేకుల్లేని బుల్లెట్ బండిలాగా యమా స్పీడ్ గా దూసుకుపోతుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం తెలిపింది.