యాంకర్ ప్రదీప్ తొలిసారి హీరోగా నటించిన చిత్రం "30రోజుల్లో ప్రేమించడం ఎలా?". ఈ చిత్రంతో యువ దర్శకుడు మున్నా టాలీవుడ్ కి పరిచయమయ్యారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం డీసెంట్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత మున్నా మరో సినిమాను ఎనౌన్స్ చెయ్యలేదు. ఆయన దగ్గర పలు ఇంటరెస్టింగ్ కథలు ఉన్నా అవకాశమిచ్చే వారు లేక ఖాళీగా ఉంటున్నాడు. మున్నా రైటింగ్, టేకింగ్ నచ్చిన మాస్ రాజా రవితేజ ఆయనకు ఒక గోల్డెన్ ఆపర్చ్యునిటీ ని ఇచ్చినట్టు తెలుస్తుంది. తనను డైరెక్ట్ చేసే అవకాశాన్ని రవితేజ మున్నాకి ఇచ్చాడా? లేక తాను ప్రొడ్యూస్ చేసే సినిమాకు డైరెక్టర్ గానా? అన్న విషయం తెలియాల్సి ఉంది. అసలు ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే.
ప్రస్తుతం రవితేజ నుండి రావడానికి రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలున్నాయి. ఈ మూడు చిత్రాలు కూడా సైమల్టేనియస్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ మూడు సినిమాలు వారాల గ్యాప్ లోనే విడుదలైనా ఆశ్చర్యపోనవసరం లేదు.