ఇటీవల వెబ్ సిరీస్ '9 అవర్స్'లో జర్నలిస్ట్‌గా కనిపించిన హీరోయిన్ మధు షాలిని కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ గోకుల్ ఆనంద్‌ను గురువారం వివాహం చేసుకుంది. మధు, గోకుల్‌లు తమిళంలో 'పంచరాక్షరం' సినిమాలో కలిసి నటించారు.వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మధు షాలిని అందరివాడు, కితకితలు వంటి సినిమాలో నటించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.