మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా 'మెగా 154'. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్‌లోకి స్టార్ డైరెక్టర్ సుకుమార్ వెళ్లారు. ఈ సినిమా షూటింగ్‌ని సుకుమార్ దగ్గరి నుంచి వీక్షించారు.ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాని భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.