కన్నడ నటి స్వాతి సతీష్ ఇటీవల ఆసుపత్రిలో రూట్ కెనాల్ థెరపీ చేయించుకుంది. అయితే సర్జరీ వికటించడంతో ఆమె ముఖం వాచిపోయింది. సర్జరీ చేసి 3 వారాలు గడిచినా ముఖం వాపు తగ్గలేదు. తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్లు స్వాతి తెలిపింది. ఇంటి నుంచి బయటకు రావడం లేదని, వచ్చిన అవకాశాలు చేజారిపోయాయని స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఆసుపత్రి, డాక్టర్ పై ఆమె కేసు వేయనున్నట్లు సమాచారం.