కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా 'విక్రమ్'. ఈ సినిమాకి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి,ఫాహద్ ఫాజిల్, సూర్య కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ సినిమా బాహుబలి 2 సినిమా రికార్డును బద్దలు కొట్టింది 300 కోట్ల వసూళ్లను సాధించింది. బాహుబలి 2 తమిళనాడులో రూ.152 కోట్లు వసూలు చేయగా, విక్రమ్ రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 16 రోజుల్లోనే ఈ కలెక్షన్లు సాధించడం విశేషం.