అది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. 'పులి-మేక' అనే టైటిల్‌తో,వెబ్ సిరీస్ ని 'జి'5 ప్రారంభించింది. పూజా కార్యక్రమంలో దర్శకుడు బాబీ క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ ఈ సిరీస్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో గోపీచంద్ నటించిన 'పంతం' చిత్రానికి దర్శకత్వం వహించిన కె చక్రవర్తి రెడ్డి మెగాఫోన్ పట్టారు.