పటాస్, సుప్రీం, ఎఫ్ 2, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరూ, ఎఫ్ 3 ...ఇలా చేసే ప్రతి సినిమాతో సూపర్ డూపర్ హిట్లు కొడుతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి తో నటసింహం బాలకృష్ణ ఒక సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని తో NBK 107(వర్కింగ్ టైటిల్) షూటింగ్ అయిపోయిన వెంటనే, బాలయ్య అనిల్ తో సినిమాను స్టార్ట్ చేస్తారు. బాలయ్య కెరీర్ లో 108వ సినిమా ఇది. ఇందులో బాలయ్య నడివయసు తండ్రి పాత్రను పోషిస్తున్నాడని, ఆయనకు కూతురిగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తుందని, బిగ్ బాస్ ఓటిటి విన్నర్ బిందు మాధవి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుందని అనిల్ ఇదివరకే తెలిపారు. బాలయ్య పుట్టినరోజు సంబర్భంగా ఇటీవలే ఈ మూవీని అధికారికంగా ప్రకటించడం జరిగింది.
తాజాగా ఈ మూవీపై మరొక ఇంటరెస్టింగ్ న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్, బాలయ్యకు స్నేహితుడిగా ముఖ్య పాత్రను పోషించబోతున్నారట. ఐతే ఆ పాత్ర తీరుతెన్నులు జోవియల్ గా ఉంటాయని తెలుస్తుంది. ఇప్పటివరకు రాజశేఖర్ నటించిన మేజర్ సినిమాలకు డైలాగ్ కింగ్ సాయికుమార్ డబ్బింగ్ చెప్పేవారు. కానీ ఈ సారి సాయికుమార్ తో కాకుండా రాజశేఖర్ తన సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పి నవ్వులు పండించనున్నారు. పాత్ర కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయంలో నిజమెంత? అన్నది తెలియాల్సి ఉంది.