ఇప్పుడు సమంత ఫ్రీ బర్డ్. తనకు నచ్చినట్లు ఉంటుంది. ఇష్టమైన సినిమాలు చేస్తోంది. అందాల ఆరబోత విషయంలోనూ హద్దులను చెరిపేసుకున్నట్టుంది. సినిమాలు, బయట ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. ముఖ్యంగా మేగజైన్ కవర్ పేజీ కోసం తనదైన మార్క్చా టుతోంది. తాజాగా పీకాక్ మేగజైన్ కోసం కిర్రాక్ పోజులు ఇచ్చింది. మునుపెన్నడూ లేని విధంగా అందాలు ఆరబోసింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత తనకు వచ్చిన స్వాతంత్రం ఇదేనంటూ సగర్వంగా చాటినట్టు ఉంది. ప్రస్తుతం సమంత యశోధ సినిమాలో నటిస్తోంది. ఆమె నటించిన 'శాకుంతలం' రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తో పాటు బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేస్తుంది. మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు చర్చల దశలోఉన్నట్టు సమాచారం.