రాశీఖన్నా చాలా ఫ్రెండ్లీ హీరోయిన్. దర్శక-నిర్మాతలకు అన్ని విధాల సహకరిస్తుంది. అడిగినప్పుడు కాల్టీట్లు ఇస్తుంది. టైమ్ కు సెట్స్ కు వస్తుంది. అంతేకాదు.. సినిమా పూర్తయిన తర్వాత తన పనైపోయింది అనుకోదు. సినిమా ప్రమోషన్ లో చురుకుగా పాల్గొంటుంది. అందుకే ఆమెను రిపీట్ చేయడానికి దర్శక-నిర్మాతలు ఇష్టపడతారు. 'ప్రతి రోజూ పండగే' తర్వాత మారుతి దర్శకత్వంలో ఆమె నటించిన సినిమా 'పక్కా కమర్షి యల్'. రవితేజతో అనుకున్న ఈ సినిమా గోపీచంద్ తో తెరకెక్కింది. జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్ర యూనిట్. దాదాపు అన్ని టీవీ ఛానల్స్, అన్ని టీవీ షోస్ ని కవర్ చేస్తున్నారు. మరోవైపు రాశీఖన్నా పర్సనల్ గా సినిమాను ప్రమోట్ చేస్తోంది. స్పెషల్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా కలర్ ఫుల్ డ్రెస్ లో కమర్షియల్ పోజులు కొట్టింది.