'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఉడుగుల డైరెక్షన్లో హీరో రానా దగ్గుబాటి, హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందనలొస్తున్నాయి. కానీ, కొంతమందికి మాత్రం ఈ మూవీ ఐడియా, డైరెక్టర్ టేకింగ్, నటీనటుల అద్భుత నటన బాగా నచ్చాయి. అందుకే ఈ సినిమాపై తమ అభిప్రాయాలను, ప్రశంసలను సోషల్ మీడియా ద్వారా తెలియచేసి సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా విరాటపర్వం మూవీపై కోలీవుడ్ దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేసారు. తను రీసెంట్గా చూసిన అన్ని తెలుగు సినిమాలలోకి విరాటపర్వం సినిమా ది బెస్ట్ అని, డైరెక్టర్ వేణు ఉడుగుల ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, ధైర్యంగా సినిమాను తెరకెక్కించారని పేర్కొన్నారు. రవన్న పాత్రను పోషించేందుకు ముందుకొచ్చిన రానాకు, అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న సాయి పల్లవికి ప్రత్యేక అభినందనలను రంజిత్ తెలియచేసారు.