మోహన రాజా దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి "గాడ్ ఫాదర్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా మలయాళంలో "లూసిఫర్" సినిమాకు రీమేక్. గాడ్ ఫాదర్ సినిమా ఆగస్ట్ నెలాఖరులో లేదా సెప్టెంబర్ తొలివారంలో విడుదలవుతుందని ఇటీవల చిరంజీవి వెల్లడించారు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ మరో ఆసక్తికర వార్తను వెల్లడించారు. పొలిటికల్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోందని ఆయన వెల్లడించారు. ఒక అద్భుతమైన సెంటిమెంట్ పాటను కంపోజ్ చేసినట్లు థమన్ పేర్కొన్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.