ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'చోర్ బజార్'

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 12:15 PM

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ప్రస్తుతం "చోర్ బజార్" అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆకాష్ సరాసన గెహ్నా సిప్పీ నటించింది. ప్రముఖ నటి అర్చన ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జూన్ 24, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని రివీల్ చేసి సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. విఎస్ రాజు నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa