ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"మై డియర్ భూతం" లో జీనీగా ప్రభుదేవా... ఫస్ట్ లుక్ పోస్టర్ ఔట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 06:44 PM

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా "మై డియర్ భూతం" అనే చిన్నపిల్లల సినిమాలో జీనీగా కనిపించబోతున్నాడు. అల్లావుద్దీన్ అద్భుతదీపం తరహా సినిమా ఇది. కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, డైరెక్టర్ గా మూడు విభిన్న పాత్రలను పోషించిన ప్రభుదేవా ఈ మూడిట్లోనూ బిగ్ సక్సెస్ అయ్యాడు. కానీ, నటుడిగా ఇప్పటివరకు ట్రై చెయ్యని పాత్రలో ప్రభుదేవా నటిస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు ఈ మూవీ నుండి ప్రభుదేవా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇందులో అల్లావుద్దీన్ గెటప్ లో ప్రభుదేవా లుక్ అద్దిరిపోతుంది. ఈ సినిమా మొత్తం ఒక చిన్న పిల్లాడికి, జీనీకి మధ్య సాగే అద్భుతమైన ప్రయాణం.
కోలీవుడ్ డైరెక్టర్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై రమేష్ పి పిళ్ళై ఈ సినిమాను నిర్మించారు. ఇమ్మాన్ ఈ సినిమాకు సంగీతమందించారు. ప్రభుదేవా తో పాటు ఈ సినిమాలో సంయుక్త, ఇమ్మాన్ అన్నచి, సురేష్ మీనన్ తదితరులు నటించారు.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa