ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాయిదాపడిన రజినీకాంత్ రీల్ కూతురి తెలుగు సినిమా

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 07:25 PM

పా. రంజిత్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం కబాలి. ఇందులో రజిని కూతురిగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది సాయి ధన్సిక. "షికారు" చిత్రంతో ఆమె తెలుగు తెరకు పరిచయమవబోతుంది. ఈ చిత్రానికి హరి కొలగాని డైరెక్షన్ చెయ్యగా, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ, నవకాంత్ లు హీరోలుగా నటిస్తున్నారు. జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర కీలకపాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ సాయిలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై పి ఎస్ ఆర్ కుమార్ నిర్మించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని మేకర్స్ గతంలోనే ప్రకటించగా, తాజాగా ఈ విడుదల తేదీ జూలై 1వ తేదీకి వాయిదా పడినట్టు తెలుస్తోంది. మూవీ వాయిదా పాడటానికి మేకర్స్ కారణం తెలపలేదు.
అన్నపూర్ణ, సురేఖ వాణి తదితరులు ఈ సినిమాలో నటించారు.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa