మెగా కాంపౌండ్ నుండి వచ్చిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు సానా డైరెక్షన్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన "ఉప్పెన" సినిమాతో అరంగేట్రం చేసిన ఈ మెగా హీరో తొలిసినిమాతోనే వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఆపై క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో చేసిన "కొండపొలం" ప్రేక్షకుల అంచనాలను అనుకోవడం లో పూర్తిగా విఫలమైంది. దీంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ఇక, వైష్ణవ్ మూడో సినిమాగా "రంగరంగ వైభవంగా" ఆల్రెడీ లైన్ లోనే ఉంది. జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
తాజాగా వైష్ణవ్ తన నాలుగో సినిమా ప్రకటన చేసాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాతో శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని , అందులో వైష్ణవ్ పవర్ఫుల్ రోల్ లో నటించబోతున్నాడని తెలుస్తోంది. జూన్ 22 న అంటే రేపు ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన జరుగుతుందని మేకర్స్ తెలిపారు. మిగిలిన నటీనటుల విషయం కూడా ఆరోజే తెలియనుంది.