టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రాశీఖన్నా గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతుంది. రెండేళ్లుగా తెలుగు వెండితెరకు దూరమైన రాశి కోసం ఆమె అభిమానులు అల్లాడిపోతున్నారు. అయితే రాశి ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని మాస్టర్ ప్లాన్ వేసింది. ఒకేసారి రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతుంది. అందులో ఒకటి గోపీచంద్ తో నటించిన "పక్కా కమర్షియల్", రెండోది నాగచైతన్యతో నటించిన "థాంక్యూ". ఈ రెండు సినిమాలు కూడా ఒక వారం గ్యాప్ లోనే విడుదలవడం విశేషం.
గోపీచంద్ హీరోగా, డైరెక్టర్ మారుతీ తెరకెక్కించిన సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ , యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించాయి. జూలై 1వ తేదీన విడుదలవడానికి రెడీ అవుతుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాశి తన చిరకాల కోరికను బయటపెట్టింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించడమే తన కల అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే బావుంటుందని అనుకుంటున్నారు.