తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తన 20వ చిత్రాన్ని తెలుగు దర్శకుడు, జాతిరత్నాలు ఫేమ్ కే.వి అనుదీప్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే కదా. ఈ మూవీ టైటిల్ అండ్ హీరో, హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్లను ఈమధ్యనే రిలీజ్ చేయగా వాటికి అభిమానుల నుండి విశేష స్పందన వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబును అభిమానులు ప్రేమతో పిలుచుకునే "ప్రిన్స్" టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ మూవీలో ఉక్రేనియన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క నటిస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, శాంతి టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేస్తున్న తమన్, తాజాగా సినిమా పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు.
డైరెక్టర్ అనుదీప్, హీరో శివకార్తికేయన్ లతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్న ఫోటోలను తమన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్తా వైరల్ గా మారాయి. ఈ ముగ్గురూ కలిసి ఫస్ట్ సింగిల్ కేమన్నా ముహూర్తం పెట్టారా? అనే అనుమానాలు మొదలయ్యాయి.