కోలీవుడ్ సీనియర్ హీరో అర్జున్, తన కూతురు ఐశ్వర్యను టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం చేస్తూ, ఒక సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే కదా. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు అర్జున్ దర్శకత్వం వహిస్తారు. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై అర్జున్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే అధికారికంగా ఎనౌన్స్ చెయ్యబడిన ఈ సినిమా నుండి మేకర్స్ వరస అప్డేట్లిస్తూ, ఇప్పటినుంచే ప్రేక్షకుల్లో తగిన బజ్ ను క్రియేట్ చేస్తున్నారు.
నిన్ననే ఈ మూవీకి స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా పని చేస్తారంటూ అధికారిక పోస్టర్ ద్వారా తెలిపిన చిత్రబృందం తాజాగా, ఈ సినిమాకు పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ రవి బసృర్ సంగీతం అందిస్తారని తెలుపుతూ ప్రకటించారు. రోజురోజుకూ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కెళుతుంది. విశ్వక్ వంటి యంగ్ హీరో సినిమాకు ఇంతటి గ్రాండియర్ ను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మున్ముందు ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్లు వస్తాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.